ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
గాంధీ మార్గం అనుసరణియమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయములో ఎస్పి అధ్వర్యంలో, పోలీసు అధికారులు , సిబ్బంది గాంధీజీ కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పి జె. సురేందర్ రెడ్డి బాపుజీ చిత్రపటానికి పూలమాల చేసి నివాళులు అర్పించారు.అనంతరం ఎస్పి మాట్లాడుతూ గాంధీ అహింస మార్గమే ప్రజలకు దిక్సూచి అని, యువత గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పి పేర్కొన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, గాంధీ ఆశయాలు ఆచరణీయం అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, జితేందర్ రెడ్డి, సతీష్, సంతోష్, ఎస్సై తామస్ రెడ్డి, సిసి పసియోద్దీన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: