ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిధిగా హాజరై, సైకిల్ ర్యాలీలో జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, వారి త్యాగాల వల్లే ప్రశాంత జీవనం గడుపుతున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుండి హన్ మాన్ టెంపుల్, జయశంకర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీనివాసులుతో కలిసి, ఎస్పి సురేందర్ రెడ్డి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ
ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజా క్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మ రణోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసు అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ పోలీసులు మన్ననలు పొందాలని ఎస్పి సూచించారు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరు ఉన్నదని, దానిని మరింత ఇనుమడింపజేసే విధంగా పని చేయాలనీ ఎస్పి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ప్రతి వ్యక్తి ఆరోగ్యం కోసం వ్యాయామం అలవాటుగా చేసుకోవాలని అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ, ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహింస్తున్నామని ఎస్పి పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి డి.ఎస్.పి రాములు, సీఐ రాజిరెడ్డి, ఇన్స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, సతీష్, సంతోష్, ఎస్ఐలు అభినవ్ రామకృష్ణ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: