పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:అక్టోబర్ 25:అమరుల త్యాగాలు,నింగికెగసిన అమరత్వం,నేల కూలిన నెత్తుటి ధారల సజీవసాక్ష్యం,అతిపెద్దదైన అమరవీరుల స్తూపం ఆవిష్కరణ జరిగి నేటికీ 32 ఏళ్లు,హుస్నాబాద్,అక్టోబరు 25:‘‘బిడ్డలారా మీరొడ్డిన నెత్తుటిని..ఇంకనివ్వం నేలలోనా..పరిచినది పంచే కాదు.కడుపుకోత పేగులురా..అంటూ హుస్నాబాద్‌లో నిర్మించిన ఆసియాలో అతిపెద్ద అమరవీరుల స్తూపానికి నేటికీ 32 ఏళ్లు..31 సంవత్సరాల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలు మరవలేని రోజు నాటి పీపుల్స్‌వార్.నేటి మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు.హుస్నాబాద్ ఎర్రజెండాలతో ఎరుపెక్కిన రోజు.వేలాది గొంతుకలు ఒక్కటై అమరులకు జోహార్లు,విప్లవ వీరులకు జోహార్లు అంటూ దిక్కులు పిక్కటిల్లెలా నినదించిన రోజు.సమసమాజ స్థాపనే ధ్యేయంగా,పెత్తందారి,భూస్వామ్య వర్గాల కబంధ హస్తాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం,నమ్ముకున్న విప్లవ బాటలో కడదాకా నడిచి అసువులు బాసిన అమరుల స్మారకార్ధం నిర్మించిన నెత్తుటి ధారల సజీవ సాక్ష్యం ఆవిష్కరించబడిన రోజు.అదే 1990 అక్టోబరు 25.చైనాలోని తియన్మాన్‌స్కైర్ తర్వాత హుస్నాబాద్‌లో పీపుల్స్‌వార్ నిర్మించిన ఆసియాఖండలంలోనే రెండో అతిపెద్ద అమరవీరుల స్మారక స్థూపాన్ని ఇదే రోజున ఆవిష్కరించారు,88 అడుగుల ఎత్తులో స్మారక స్తూపం.పీపుల్స్‌వార్ ఉద్యమ అటుపోట్లకు సాక్షిగా నిలుస్తుందని భావించి నక్సలెట్లు ఈ అమరవీరుల స్తూపం నిర్మించారు.కానీ ఇది శత్రువు కంటిలో నలుసుగా మారి 10 సంవత్సరాల కాలంలోనే ఈ స్తూపం నేల మట్టమయింది.కూలిన శిథిలాల వద్దకు వెళితే తెలియని భావోద్వేగం..గౌరవంతో కూడిన భయం.చెట్టంత కొడుకును పొగొట్టుకున్న ఆందోళన గోచరిస్తుంది1989 నుంచి ఏడాది పాటు అప్పటి పీపుల్స్‌వార్ ప్రతినిధులు,సానుభూతిపరులు,మిలిటెంట్లు,రైతులు,కూలీలు గ్రామాల్లో తిరుగుతూ పైసాపైసా కూడబెట్టి 1972–89 మధ్యకాలంలో రాజ్యం జరిపిన ఎదురుకాల్పుల్లో అమరులైన 88మంది పీపుల్స్‌వార్ అమరవీరుల స్మారకార్థం హుస్నాబాద్‌లోని అక్కన్నపేట రోడ్డులోని ఎత్తైన ప్రదేశంలో 88 అడుగుల ఎత్తుతో స్మారక స్థూపాన్ని నిర్మించారు.అప్పటి పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శి సందేవేని రాజమౌళి అలియాస్ ప్రసాద్,ఆధ్వర్యంలో ఈ స్తూపాన్ని నిర్మించారు.రూ12లక్షలతో రాజస్థాన్ నుంచి నల్ల గ్రానైట్ రాయిని తెప్పించి నిర్మాణం చేశారు.110 కిలోల బరువు కలిగిన భారీ ఆకారంలో సుత్తి కొడవలి చేయించి స్తూపంపైన ఉంచారు.నల్లటి స్తూపంపైన ఎర్రటి సుత్తికొడవలి మరింత ఆకర్షణగా నిలిచింది,ఈ నిర్మాణంలో బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు,రైతులు,కూలీలు భాగస్వాములై అమరత్వం నింగికెగసేలా స్థూపాన్ని తీర్చిదిద్దారు1989 నుంచి సంవత్సరం పాటు ఈ ప్రదేశం విప్లవ గీతాలు,పనితో పాట.సామూహిక భోజనాలు,ప్రజాకోర్టులతో నిత్యం సందడిగా ఉండేది.ఈ స్తూప నిర్మాణంలో హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన బొమ్మగాని నారాయణ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.88మంది అమరుల పేర్లను స్తూపం కింది భాగంలో చెక్కించారు.ఈ నిర్మా ణం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కల్పించినా దానిని ఎదుర్కొని నిర్మించారు.అధికారుల కిడ్నాప్ స్తూప ఆవిష్కరణకు ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో అప్పుడు ఇక్కడ పని చేస్తున్న వయోజన విద్య ప్రాజెక్టు అధికారి శేషుకుమార్,ఏఈ బాల్‌లింగారెడ్డి,ఎంఆర్‌వో రాజమౌళిని కిడ్నాప్ చేసి ఆవిష్కరణకు ఆటంకం కల్పించొద్దని స్థానిక దళం డిమాండ్ చేసింది.దీంతో 25 అక్టోబరు 1990 లో ఎర్రజెండా రెపరెపల మధ్య స్తూపావిష్కరణ జరిగింది.పోరుబాటలో అమరుడైన పులిరాములు@కిరణ్ తండ్రి పులి మల్లయ్య ఈ స్తూపాన్ని ఆవిష్కరించారు.కార్యక్రమానికి ప్రజాయుద్ధనౌక గద్దర్,విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు,బాలగోపాల్,శ్రీమన్నారాయణ హాజరై అమరవీరుల త్యాగాలను వివరించారు.అప్పటి నుంచి హుస్నాబాద్‌కు ఈ స్తూపం ఎంతో వన్నె తెచ్చింది.ఎంతో మంది పర్యాటకులను ఇక్కడికి రప్పించుకుంది.వేర్పాటు వాద సంస్థ అయిన జేకేఎల్‌ఎఫ్ నాయకుడు యాసీన్‌మాలిక్ ఈ స్తూపాన్ని సందర్శించి పరవశించాడు.అనంతరం పీపుల్స్‌వార్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలతో అప్పుడు 180మందిపై కేసులు పెట్టారు.ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టి వేశారు.2000 సంవత్సరంలో కూల్చివేత
పీపుల్స్‌వార్ ఉద్యమం తీవ్రమైన క్రమంలో 1991 డిసెంబర్ 19న అక్కన్నపేట మండలం రామవరం వద్ద పీపుల్స్‌వార్ నక్సలైట్లు మందుపాతర పేల్చడంతో సీఐ యాదగిరి,ఎస్‌ఐ జాన్‌విల్సన్‌లతో పాటు మరికొంతమంది మృతిచెందారు.అయితే ఎక్కడ వార్ ఘటనలకు పాల్పడిన ఈ స్తూపం మీదనే పగతీర్చుకునే వారు.అలా మూడుసార్లు దీనిని కూల్చివేసేందుకు యత్నించారు.దీంతో పాక్షికంగా దెబ్బతిన్నది. జనవరి 2000 సంవత్సరంలో హుస్నాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఇంటిని పేల్చివేయడంతో గ్రీన్‌టైగర్స్ పేరుతో స్తూపాన్ని డిటోనేటర్లు పెట్టి పూర్తిగా ధ్వం సం చేశారు.దీంతో స్తూపం నేల మట్టమైంది.నేల మట్టమైన శిథిలాలను ఈ ప్రాంత ప్రజలు తమ ఇండ్లలో ఉంచుకుని నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు.బౌతికంగా స్తూపం నేలమట్టమైనా భావితరాలకు ఈ శిథిలాలు అమరులైన వీరుల త్యాగాల చరిత్రను జ్ఞాపకం చేస్తూనే ఉంటాయి.

Post A Comment: