ఉమ్మడివరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
కోట్ల రూపాయల నగదు, పదవులు, కాంట్రాక్టుల ఆశచూపి టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రకు నిరసిస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తాలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ నిరసన బీజేపీ, మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. పాల్గొన్న డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ప్రజలు.
బీజేపీ చేసిన వికృత రాజకీయ క్రీడకు నిరసనగా బీజేపీ,ప్రధాని మోది దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. మోదీ, బీజేపీకి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనే కుట్ర చేసిందని, ఆ కుట్రను ముఖ్యమంత్రి కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. తెలంగాణపై బీజేపీ విష పన్నాగం. టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు బారీ కుట్రకు తెరతీసారు. మా ఎమ్మెల్యేలను కొనేందుకు పన్నాగం పన్ని అడ్డంగా బుక్ అయ్యారు. వీళ్ళ పన్నాగాన్ని పసిగట్టిన మా నాయకుడు కేసీఆర్. తెలంగాణతో గోక్కుంటే ఏమౌతుందో బీజేపీకి అర్థమయ్యి ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన ఎమ్మెల్యేలం మేమంతా. మా ప్రభుత్వాన్ని కూల్చజూసి, మా నాయకుడిపై కుట్రలు చేస్తే ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో కేసీఆర్ అవుతాం.. ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండా గా బీజేపీ సాగుతుంది. స్వాములతో బేరాలు నడుపుతూ నీచ రాజకీయం నడుపుతుంది.
దేశంలో వికృత రాజకీయ క్రీడ నడుస్తుంది. వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుంది. అభివృద్దిని మరిచి అరాచకాలకు తెరతీస్తుంది. అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతుంది. తెలంగాణ అంటే ముందు నుండీ బీజేపికి వివక్ష ధోరణే.తల్లిని చంపి పిల్లను బ్రతికించారంటూ గతంలో మోదీ తన అక్కసు వెలగక్కాడు.తెలంగాణ కు రావాల్సిన నిధులు విధులకు అడ్డం పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్నే కూల్చేందుకు కుట్ర చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావటం బీజేపీకి మింగుడు పడటం లేదు. సార్ నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీతో బీజేపీ దడుసుకుంటుంది. అందుకే వాళ్ల పోకస్ ఇక్కడ పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారీ కుట్ర పన్నారు. అడ్డంగా దొరికినా ఇంకా బుకాయిస్తున్నారు.
ఇది తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం ఉండగా తెలంగాణాను మీరేం చేయలేరు. తెలంగాణను గెలవాలంటే కేసీఆర్ కన్నా ఎక్కవగా తెలంగాణను ప్రేమించాలి. ఇలా కుట్రలు చేస్తే మీ కుట్రలు చేదించేందుకు ఇక్కడున్నది కేసీఆర్. సమైక్య పాలకుల కుట్రలను ఛేదించాం. ప్రభుత్వం ఏర్పాటవగానే ఓటుకు నోటుతో చంద్రబాబు కుట్రను చేదించాం.నేడు బీజేపీ కుట్రను ఛేదించాం. కుట్రల బ్రతుకులు మీవి.మీకు ప్రజలు బుద్ది చెబుతారు. మీ వికృత చేష్టలను ప్రజాక్షేత్రంలో చర్చ పెడతాం. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసే వాళ్ళను ప్రజలు తిరస్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పాలి. వరంగల్ తూర్పు అభివృద్ది అద్భుతంగా చేస్తున్నం. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. ప్రజలకు సేవ చేసే వారెవరో, ప్రజలను మభ్య పెట్టే వారెవరో ప్రజలు గ్రహించాలి. మునుగోడులో అద్భుత విజయం సాధించబోతున్నామన్నారు.


Post A Comment: