పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:అక్టోబర్:27:నిక్షయ్ పోషణ యోజనలో భాగంగా టి.బి.వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరకులను పంపిణీ చేసిన కలెక్టర్,టి.బి.వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకర,చక్కటి ప్రణాళిక మేర సమతుల్య,పోషకాహారం తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ తెలిపారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ,లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణతో కలిసి పాల్గొని టి.బి,వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరకులను,వరద బాధితులకు ఇంటి సామాన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాలను నిర్వహిస్తూ టి.బి.నిర్ధారణ పరీక్షలు, రోజువారీ మందులను పూర్తిగా ఉచితంగా అందించి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించడం జరుగుతుందనీ తెలిపారు.రెండు వారాలకు మించి దగ్గు,జ్వరం,రాత్రిపూట చెమటలు పట్టడం,ఆకలి లేకపోవడం,బరువు తగ్గడం టి.బి.లక్షణాలు అని,వ్యాధి సోకిందో లేదో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు.జిల్లాలో మొత్తం 437 టి.బి.వ్యాధిగ్రస్తులు ఉన్నారని,ఆరోగ్యకరంగా ఉన్నప్పటి కంటే వ్యాధి సోకిన తర్వాత ప్రణాళిక మేరకు బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలని,పోషకాహార లోపం,బరువు తక్కువ లేకుండా చూడాలని తెలిపారు.నిక్షయ్ పోషణ యోజన క్రింద 2018 ఏప్రిల్ ఒకటి నుండి అయిన ప్రతి రోగికి ఐదు వందల రూపాయలు పూర్తి చికిత్సా కాలం పోషకాహార నిమిత్తం నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.బియ్యం,పప్పు దినుసులు,గుడ్లు,పాలు,కూరగాయలు కొనడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించాలని,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ,క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ద్వారా దాతలు అందించిన నిత్యావసర సరకులు 3 కేజీల బియ్యం,కిలో పప్పు,లీటర్ ఆయిల్,30 కొడిగ్రుడ్లను వ్యాధిగ్రస్తులకు అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్,రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ కావేటి రాజగోపాల్,లయన్స్ క్లబ్ సభ్యులు బండా బాబురావు,ఈ.శ్రావణ్,జి.మాధవి,కాంపెల్లి ప్రవీణ్ కుమార్,ఆర్.శశాంక,జి,రామచంద్రా రెడ్డి,డి.వి.ఎస్.మూర్తి,రెడ్ క్రాస్ సభ్యులు పి.శ్రీకాంత్,అచ్యుత్,తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: