మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ విట్టల్ నగర్ లో నివాసం ఉండే కొలుగూరి ప్రభాకర్ హెచ్ కె ఆర్ టోల్గేట్ లో పనిచేసే ప్రభాకర్కు అకస్మాత్తుగా కాలు చేతులు సచ్చుపడి మంచానికే పరిమితమైన ప్రభాకర్ యొక్క దీనస్థితిని తోటి ఉద్యోగి ఫోన్ ద్వారా సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్కు తెలుపగా విట్టల్ నగర్ లోని ప్రభాకర్ ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరియు 25 కిలోల బియ్యం అందజేశారు అనంతరం మడిపల్లి మల్లేష్ మాట్లాడుతూ ప్రభాకర్ యొక్క పరిస్థితి చూసి చాలా బాధ వేసింది అని నేను ఏడాది సేవాస్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించిన ట్రస్టులో కొలుగూరి ప్రభాకర్ సభ్యులుగా చేరి ప్రతినెల అతనికి తోచిన సహాయం అందిస్తు నేను చేసే సేవలో భాగస్వాములై నన్ను ముందుకు నడిపించారు అలాంటి సేవా హృదయం కలిగిన ప్రభాకర్కు అకస్మాత్తుగా కాళ్లు చేతులు సచ్చుపడి అనారోగ్యంతో గురికావడం చాలా బాధాకరమని మల్లేష్ విచారం వ్యక్తం చేశారు ప్రభాకర్కు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారం ఎప్పుడూ ఉంటుంది అని బాధితునికి ధైర్యం చెప్పారు పౌండేషన్ సభ్యులు చింతల భాస్కర్ సహకారంతో ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు మరియు ఫౌండేషన్ సభ్యుల సహకారంతో 25 కిలోల బియ్యం అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించిన చింతల భాస్కరరావుకు మరియు సేవాస్పూర్తి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ప్రభాకర్ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మల్లేష్ అన్నారు ఈ కార్యక్రమంలో బొంతల లక్ష్మణ్ ఎనగంటి లక్ష్మి నారాయణ వినయ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: