ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్చి సుంక శ్రీధర్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టిడబ్ల్యుజెఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 10 వ తేదీన చేపట్టే జర్నలిస్టుల డిమాండ్స్ డే ను విజయవంతం చేయాలని టిడబ్ల్యుజెఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు ఒక ప్రకటనలో కోరారు.గత 25 ఏళ్లుగా జిల్లాలోని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవని, ఇప్పటికైనా జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇంటి స్థలాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ ఈనెల 10వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
Post A Comment: