మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్.రాజశేఖర రెడ్డి నేతృత్వంలో జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని శాప్ మాజీ చైర్మన్ *ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో IJU ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ గౌడ్ పలు సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి శాప్ మాజీ చైర్మన్ *ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ గతంలో వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అక్రిడిటేషన్ కార్డు ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదటగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేలా ఒత్తిడి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను *ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ జిల్లా దాడుల కమిటీ చైర్మన్ సిపెల్లి రాజేశం, మరియు పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కొంకటి రవీందర్, గొర్రె తిరుపతి, మాదాసు శ్రీనివాస్ జాతీయ కార్యవర్గ సభ్యులు కొల లక్ష్మాన్, కాంగ్రెస్ నాయకులు ముక్కెర శ్రీనివాస్, గంగాధర రమేష్, కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: