ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను క్రీడా జ్యోతి ని వెలిగించి ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆట ఆటలతో కూడినదే అసలైన చదవని, విద్యా వినోదంతో కూడిందే మంచి విద్య అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వెనుకటికి గురు ముఖ జరిగిన విద్య అభ్యసనం వల్ల ఆనాడు ఆయా విద్యల్లో వారు ఆరితేరారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విద్యావ్యవస్థని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గొప్పగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి చెప్పారు గురుకులాలతో విద్యార్థులకు అన్ని రకాలుగా విద్య అందుతుందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను క్రీడా జ్యోతి ని వెలిగించి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారిణి లతో కలిసి వాలీబాల్, బతుకమ్మ ఆడి సందడి చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఏదైనా ఒక రంగంలో రాణించడం గొప్ప వరం అన్నారు. కొందరు ఆటల్లో, మరికొందరు చదువులో బాగా రాణిస్తారని చెప్పారు. రెండు రంగాల్లో రాణించే వారు చాలా అరదుగా ఉంటారని మంత్రి అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. తన వరకు తాను బాగా ఆటలు ఆడటంతో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లానని చెప్పారు. తర్వాత రాజకీయ రంగాన్ని ఎంచుకొని ఓటమి ఎరుగని నేతగా ఎదిగానని మంత్రి విద్యార్థులకు వివరించారు. రంగం ఏదైనా, ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఉద్బోధించారు. 

తెలంగాణ వచ్చిన తర్వాతే, విద్యారంగం బాగా అభివృద్ధి చెందుతున్నట్లు మంత్రి తెలిపారు. దాదాపు 7 వేల కోట్లతో మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని, స్కూల్స్ ని ప్రైవేట్ కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే గురుకులాలను ఏర్పాటు చేసి పూర్తి ఉచితంగా కేజీ నుంచి పీజీ దాకా విద్యను అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ప్రభుత్వ విద్యకు పోటీ పెరిగి, సీట్లు దొరకని పరిస్థితి వచ్చిందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఇవ్వాళ వివిధ క్రీడల్లో అద్భుత క్రీడాకారులు తయారయ్యారు. ప్రత్యేకించి దళిత, బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు బాగా రాణిస్తున్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారని మంత్రి అన్నారు.

క్రీడా నైపుణ్యాలు ఉన్నవాళ్లకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు, వారికోసం ప్రత్యేకంగా క్రీడా స్కూల్స్, అకాడెమీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు, పరికరాలు సమకూర్చినట్లు మంత్రి వివరించారు. 

కేవలం విద్య క్రీడా రంగాలనే గాక, అభివృద్ధి, సంక్షేమానికి కూడా సీఎం కెసిఆర్ గొప్పగా ఆదరిస్తున్నారని వివరించారు.

ఈ నెల 25,26,27 తేదీల్లో 3 రోజులపాటు క్రీడలు జరుగు తాయి. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భం లోనూ వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని 14 గురుకులాలకు చెందిన 1100 మంది విద్యార్థినిలు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. కాగా మంత్రి వారిని అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

అంతకుముందు మంత్రి అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. క్రీడా వందనాన్ని స్వీకరించారు. విద్యార్థులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, సోషల్ వెల్ఫేర్ అర్ సి ఓ సూరినేని విద్యా రాణి, అధికారులు, ఆయా గురుకులాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: