ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మంచి ఆరోగ్యానికి నడక, వ్యాయామమే మంచి మార్గమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్ని సమస్యలకు అదే అసలైన మందు, అనారోగ్య కారకాలకు విరుగుడు అని అన్నారు. అజరా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో భద్రకాళి బండ్ నుంచి జే ఎన్ ఎస్ స్టేడియం వరకు నిర్వహించిన 5కే రన్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి నడిచారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి రన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నడకను అనుసరించాలని, డాక్టర్లు చెబుతున్నారు విధంగా అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడే దారి నడకే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ సుందర్ రాజ్, హాస్పిటల్ సిబ్బంది, ఒత్సాహిక యువత పాల్గొన్నారు.
Post A Comment: