ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలోని చెల్పూరు గ్రామంలో బతుకమ్మ చీరలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
రాష్ట్రంలోని మహిళలందరికీ దసరా పండుగ కానుకగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత మన సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ, పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ లో అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆడ బిడ్డలకు చీరలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి మహిళ సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు, అందుకు గాను 339.73కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాలు ఏనాడు మహిళల అభ్యున్నతి పై శ్రద్ధ వహించలేదని, తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. బతుకమ్మ చీరల తయారీ వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.
Post A Comment: