ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ చైర్మన్ కే.రాధాదేవి ఆదేశాల మేరకు ఆదివారం 25 న మల్లికాoబ మనోవికాస కేంద్రంలో వరల్డ్ డెఫ్ డే ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా షేక్ ఆరిఫ్ (రైల్వే జడ్జి) పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షేక్ అరీఫ్ మాట్లాడుతూ " బదిరులు సాధారణ వ్యక్తులలా జీవించడానికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి అని తెలిపారు. వినికిడి లోపం ఉన్నప్పడికి సమాజంలో అందరితో సమాన గౌరవ మర్యాదలు పొందుతున్నారు మరియు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు కూడా పొందుతున్నారు అని అన్నారు. సంకేత భాష నేర్చుకోవడానికి చెవిటి వారికి శిక్షణ ఇవ్వడం మరియు ప్రజలతో వారి సామాజిక సంబంధాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బదిరులకు ఆత్మ విశ్వాసాన్ని కలుగజేయాలని కోరారు. తదుపరి ఆశ్రమంలోని పిల్లలు వారి నృత్య ప్రదర్శన తో అలరించారు. మరియు వారికి న్యాయమూర్తి పండ్లు,బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లికాoబ నిర్వాహకులు బండ రామలీల ,బండ సదానంద0,కోడం కళ్యాణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: