ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మలికాంబ మనోవికస కేంద్రంలోని చిన్నారులతో కలిసి దాస్యం రేవతి వినయ్ భాస్కర్ బతుకమ్మ ఆడారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ ఉత్సవాలు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా అందిస్తుందని తెలిపారు.
Post A Comment: