మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరం.ఈ ఆలయంలో భక్తుల ఆధ్యాత్మికత కనుగుణంగా సేవలు అందించాల్సిన ఆలయ ఉద్యోగులు నేనే రాజు..నేనే మంత్రి అంటూ భక్తులకు ముక్తి కల్గించే ద్విలింగాల ముక్తీశ్వరులు కూడా తమకు భయపడతారని దేవస్థానంలో తెగ అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులతో పాటు ఇతర భక్తుల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..సదరు ఆలయ సిబ్బంది భక్తులపై ప్రవర్తన,అహంకార పూరితమైన పోకడలు ప్రదర్శించి దర్శించుకునే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం,పూజలకు వచ్చే భక్తులకు కనీస సేవలు అందించకుండా,కేవలం భక్తుల నుండి ప్రధానంగా డబ్బులు కొల్లగొట్టడం నిత్య కృత్యంగా మారింది.వారికి తెలిసిన పెద్ద స్థాయి వారికి ఒక విధంగా,చిన్న స్థాయి వారికి మరో విధంగా,వాళ్ల స్వతంత్ర నిర్ణయాలతో అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారని,పూజా భక్తులు సంబంధిత పూజల టికెట్లు తీసుకున్న కానీ,దక్షిణ అడిగినంత ఇచ్చే స్తోమత లేని వారిని ఆశీర్వదించకపోవడం, వారితో దురుసుగా ప్రవర్తించడం జరుగుతుందని వాపోతున్నారు.కాళేశ్వరం ఆలయంలో ఉన్నత అధికారుల చర్యలు గాలికి వదిలి వేయడంతో ఆలయ సిబ్బంది ఏ ఒక్కరు కూడా దేవాలయంలో సమయపాలన పాటించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేసి, అసభ్య పదజాలంతో దూషిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని,పలువురు స్థానిక,ఇతర భక్తులు అయోమయానికి గురవుతూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.ఇకనైనా బాధ్యతగల ఆలయ అధికారి ఇట్టి విషయాలను పరిగణలోకి తీసుకొని,భక్తి పరంగా ఆలయంలో అవినీతికి పాల్పడుతు లక్షల రూపాయలు దండుకుంటున్న సిబ్బందిని,ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా రాజకీయ ప్రజా ప్రతినిధులు, నాయకులు,పై స్థాయి అధికారుల ఫైరవీలకు తలోగ్గ కుండా,విధుల్లో నిర్లక్ష్యం చేస్తూ,భక్తులను ప్రలోభాలకు గురి చేస్తూ, అహంకారపూరితంగా వాళ్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆలయ సిబ్బందికి మెమోలు జారీ చేయడమే కాకుండా,ఇటువంటి సమస్యలు మళ్లీ పునరావృత్తం కాకుండా భక్తి భావాలు నీతి నిజాయితీ మానవత్వం మరిచిన ఉద్యోగులను తక్షణమే విధులనుండి శాశ్వతంగా,శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం నుండి తొలగించి,ఇట్టి ఇబ్బందుల విషయాల నుండి మాకు విముక్తి కల్పించి,మా నుండి మీరు మనస్ఫూర్తిగా ప్రశంసలు అందుకోవాలని పలువురు స్థానిక భక్తులు,ఇతర భక్తులు,ప్రజలు వేడుకుంటున్నారు.
Post A Comment: