ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ అందించి పోలీసుల గౌరవం మరింత పెంచే విధంగా కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 19 మంది ఫిర్యాదారులు హాజరై సమస్యలను ఎస్పీ కి తెలియజేసి, అర్జీలను ఇచ్చారు. ఈ సందర్బంగా బాధితుల సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులు సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరిoచాలని ఎస్పి ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, వారితో స్నేహపూర్వకoగా ఉండాలనీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల చట్టారీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఎదురైతే బాధితులు, ఫిర్యాదు దారులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పి సురేందర్ రెడ్డి సూచించారు.
Post A Comment: