మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత 11 రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అనేక రూపాలుగా నిరసన దీక్ష చేస్తున్న సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వంటా-వార్పు కార్యక్రమంలో హాజరైన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ *ఎంఎస్ రాజ్ ఠాకుర్ మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే హక్కులు సాధిస్తామని, సాధించే వరకు సంపూర్ణంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు..అనంతరం నిర్వహించిన కార్యక్రమం లో కార్మికులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు..

Post A Comment: