ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వరంగల్ 33 వ డివిజన్ పెరుకవాడలో పించన్ల పంపిణి కార్యక్రమంలో భాగంగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎంపి పసునూరి దయాకర్, కుడా చైర్మన్ సుందర్ రాజుయాదవ్, కార్పోరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్, దిడ్డి కుమారస్వామి, ముఖ్య నాయకులు. పెరకవాడలోని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 4 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ పెరుకవాడ నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ప్రతీ వాడ నేను తిరిగినవాన్ని, నా బాల్యం మీ మధ్య గడిచింది..నేను మీ మద్య పెరిగిన వాన్ని. అందరూ నన్ను తమ సొంత బిడ్డలా చూసుకుంటారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా. పేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తాం. 4 కోట్ల తో నేడు రోడ్లు అభివృద్ది ప్రారంభిస్తున్నాం. ప్రతీ వీదికి రోడ్లు, కాలువలు నిర్మాణం పూర్తి చేస్తాం. నేను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ది చేసే బాధ్యత నాది.ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. పెరుకవాడ ముంపుకు గురికాకుండా పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నాం.70 కోట్ల పై చిలుకు నిదులతో వరద నీటి తరలింపు స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మిస్తున్నం, పెరుకవాడ అభివృద్ది అద్బుతంగా చేస్తాం. నియోజకవర్గంలో జిల్లా కేంద్రం తీసుకువచ్చాం.తద్వారా భూముల ధరలు పెరిగాయి, అభివృద్ది వేగమై, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. జిల్లాలో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి 1100 కోట్లతో నిర్మిస్తున్నాం.నియోజకవర్గంలో అద్బుతమైన రోడ్లు,డ్రైన్స్ నిర్మించాం.60 ఏండ్ల కల అండర్ బ్రిడ్జ్ వెంట్ నిర్మాణం చేపట్టాం. 240 కోట్లతో నియోజకవర్గంలో ముంపు సమస్యను దూరం చేస్తున్నాం.220 కోట్లతో రంగశాయిపేట ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నం.

7 గురుకుల పాఠశాలల్లో పేదల పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందజేస్తున్నాం. ఇంటింటికి నల్లా అందజేసాం. మోడల్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం.

 మీ బిడ్డగా నేను సాదించిన ఘనతలు ఇవి. మరెన్నో పనులు చేపడతాం.

వృద్దులను,దివ్యాంగులను,ఒంటరి మహిళలకు ఆసరాగా కొత్త పించన్లను ముఖ్యమంత్రి కేసీఆర్  అందజేస్తున్నారు. ఇంటింటి సర్వే చేపట్టి పెరుకవాడకు ప్రతీ పేదవారికి సంక్షేమాభివృద్ది ఫలాలు అందిస్తాం.

పేదరికం నుండి ఈ ప్రాంతంలో బ్రతికినవాన్ని మీ అందరి సహాకారంతో కష్టపడి మీ బిడ్డనైన నేను ఈ స్థానంలో ఉన్నాను. మీకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నా.నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతాన్ని మీ బిడ్డగా అభివృద్ది చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కే.టీ.ఆర్  ఆశీర్వాదంతో 3800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నాం.భవిష్యత్ లో మరింత అభివృద్ది చేస్తాం.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: