ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ ప్రజావాణి కార్యక్రమానికి పన్నెండు దరఖాస్తులు వచ్చాయని జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత పేర్కొన్నారు. నాలుగు దరఖాస్తులు వ్యక్తిగత లోన్ ల కోసం, నాలుగు దరఖాస్తులు దివ్యాంగుల పెన్షన్ కోసం, మూడు దరఖాస్తులు మూడు చక్రాల సైకిళ్ల కోసం ఒకటి పోలీస్ రక్షణ కోసం దరఖాస్తులు సమర్పించారని జిల్లా సంక్షేమ అధికారి సబిత తెలియచేసారు

కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య, ఆర్ అండ్ బీ ఈ ఈ సీహెచ్ రమేష్, హనుమకొండ సిడిపివో కే మధురిమ,

గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్ సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, వైద్యారోగ్య శాఖ ఎంపిహెచ్ఎస్ జే రమేష్, 

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నుండి పి రేవంత్ మరియు దివ్యాంగుల జేఏసి కన్వీనర్ నల్లెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

పోషణ మాసంలో భాగంగా

సెప్టెంబర్ ఒకటి నుండి మొదలు పెట్టిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున హనుమకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపివో కే మధురిమ ఆధ్వర్యంలో  హనుమకొండ బస్ స్టాండ్ లో మానవహారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సీడీపీవో మధురిమ మాట్లాడుతూ ఎవరు పోషకాహార లోపంతో బాధ పడకూడదని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని,పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అనంతరం పోషణ మాసం నినాదాలు చేసి, పోషణ ప్రతిజ్ఞ చేసారు,కార్యక్రమంలో డెప్యూటి ఆర్ఎం (రవాణా శాఖ)రమేష్, సూపర్వైజర్లు రాజ్యలక్ష్మి, కవిత, రమ,సుశీల, పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ టి సుమలత, ఎస్బీ సీసీ యూనిసెఫ్ చీఫ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: