చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
:మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. జిల్లాఉపాధ్యక్షులు రమనగోని శంకర్.
రాష్ట్రప్రభుత్వం ఎనిమిదేండ్లుగా మునుగొడుకు చేసిందేమీ లేదని ప్రజలను పట్టించుకోకుండా కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతలేని నిర్మాణాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని అధికారపార్టీకి తగిన బుద్ధిచెప్తారన్నారు.ఓటమి భయంతో మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు
నిర్వహిస్తున్నారని ఎన్నిసమ్మేళనాలునిర్వహించినా ఓటమి తప్పదని హెచ్చరించారు. మునుగోడు ప్రజలు అభివృద్ధి కేవలం బీజేపీ వల్లనే
సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నారని అన్నారు.
Post A Comment: