చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన
నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో శుక్రవారం బిజెపితీర్థం పుచ్చుకున్నారు. బిజెపి లో చేరిన వారికి రాజగోపాల్ రెడ్డి కాషాయకాండవాలను కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రానున్న
రోజులు బీజేపీవే అన్నారు. మునుగోడు నుంచి బిజెపి చరిత్ర సృష్టించడం ఖాయం అన్నారు.పార్టీలో చేరిన వారిలో గుత్త కిషన్ రెడ్డి, బండ్ల సత్తయ్య, పూజారి నరసింహ, బాతరాజు ఆంజనేయులు, ఐతరాజు యాదయ్య, ఎలకరాజు వెంకటేష్, బక్క జగన్, రాహుల్ తదితరులున్నారు ఈ
కార్యక్రమంలో బిజెపి నాయకులు బక్క శ్రీనాథ్, దేవరకొండ కనకాచారి, ఎరుకల స్వామి గౌడ్,బక్క యాదయ్య, సమన్వయకర్త బాతరాజు సైదులు తదితరులున్నారు.

Post A Comment: