ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నకిలీ ఓటర్ల నిర్మూలనకు జిల్లాలోని ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్య రాణీ అన్నారు.
మంగళవారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైయివేట్ విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ కొత్త ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానం ఎపిక్ లో మార్పులు, సవరణలకు సంబంధించిన వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాల మహిళలు భాగస్వాములు కావాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 ద్వారా ఓటరుగా ఫారం 6 బి ద్వారా ఆధార్ అనుసంధానం నమోదు చేయించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వాసు చంద్ర, మెప్మా పిడి బధ్రు నాయక్, ఎన్నికల పర్యవేక్షకులు వరలక్ష్మీ, డిటి సమ్మక్క, వివిధ కళాశాలల, పాఠశాలల ప్రాధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: