మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెరిగిన డిఏ ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్టర్లు వెంటనే చెల్లించాలని ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఎన్టిపిసి లో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల డిఏ సర్కులర్ విడుదల చేసిందని, దానికి అనుగుణంగా ఎన్టిపిసి యాజమాన్యం డి ఏ ఏరియర్స్ డబ్బులను కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని కాంట్రాక్టర్లకు, యుపిఎల్ అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
సంబంధిత డిపార్ట్మెంటల్ హెచ్వోడి అధికారులు కూడా డిఎ ఏరియర్స్ డబ్బులు చెల్లించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కాంట్రాక్టర్లు కార్మికులకు చెల్లించడం లేదని, తెలంగాణలో దసరా పండుగ కార్మిక కుటుంబాలకు చాలా పెద్ద పండుగని, వెంటనే కాంట్రాక్టర్లు ఈనెల 30 తారీఖు లోపల డి ఏ ఏరియర్స్ డబ్బులను చెల్లించాలని, అలాగే గత నెల నిరసన తెలియజేసిన మూడు రోజుల వేతనాలను కూడా చెల్లించాలని, లాఠీ చార్జీలో గాయాలైన కార్మికులకు వైద్య ఖర్చులు మరియు నష్టపోయిన వేతనాలు చెల్లించాలని, లేనియెడల కార్మికులు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జేఏసి కార్మిక సంఘాల నాయకులు కౌశిక్ హరి, నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఆర్ రాజమల్లయ్య,చిలుక శంకర్, బుచ్చన్న, ఈ భూమయ్య, డి సత్యం, ఎం శంకర్, ఆర్ లక్ష్మణ్, టీ శ్రీనివాస్, నాగభూషణం, ఏ శ్రీనివాస్, సిహెచ్ సత్యం, మేకల కొమురయ్య పాల్గొ న్నారు.
Post A Comment: