ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను బహిరంగ వేలం ద్వారా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో విక్రయించారు. మంగళవారం జిల్లా ఆర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో భూపాలపల్లి జిల్లాతో ఇతర జిల్లా నుంచి దాదాపు 81 బిడ్డర్లు, (వ్యాపారులు) హాజరయ్యి, ఉత్సాహంగా పాల్గొని, రూ. నాలుగు లక్షల 12 వేలు చెల్లించి వాహనాలు తీసుకెళ్లడం జరిగింది. ఈ వేలంపాటలో ఎస్పీ జె. సురేందర్ రెడ్డి ద్వారా నియమించబడిన వేలం కమిటీ సభ్యులయిన భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు, ఏ. రాములు, బోనాల కిషన్, ఇన్స్పెక్టర్ లు పెద్దన్న కుమార్, జితేందర్ రెడ్డి, ఎం.టి.ఓ సతీష్ పాల్గొన్నారు.

Post A Comment: