మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రియమైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు విజ్ఞప్తి, గత 18 రోజుల నుండి మన నిర్వహించిన నిరవధిక సమ్మెలో పాల్గొన్న మీ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాము. మన పోరాటం వల్ల సింగరేణి యాజమాన్యం హైదరాబాద్ ఆర్ఎల్సి ఆఫీసులో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించిన అనంతరం రాత్రి 9 గంటలకు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సింగరేణిలో జీవో నెంబర్ 22న అమలు చేసుకొనుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీ&ఎండి గారు లెటర్ ను పెట్టడంతో పాటుగా ఇతర విషయాల పైన అగ్రిమెంట్ అయినది. కావున మన కాంట్రాక్ట్ కార్మికులందరూ మంగళవారం నుండి విధులకు హాజరుకావాలని తెలియజేస్తున్నాం.కావున కాంట్రాక్ట్ కార్మికులందరూ విధులకు హాజరుకావాలని, డ్యూటీ ల వద్ద మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తక్షణమే ఫోన్ చేసి మన నాయకుల సహాయం తీసుకోవాలని తెలియజేస్తున్నాము, మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హెడ్ ఆఫీస్ వద్ద మన కాంట్రాక్ట్ కార్మికులందరికీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. కావున కాంట్రాక్ట్ కార్మికులందరూ తప్పక హాజరు కావాలని కోరుతున్నాము. అభినందనలతో
సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ.
Post A Comment: