నేడు మునుగోడులో జరిగే నియోజకవర్గ ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని భాజపా చౌటుప్పల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. 21వ తేదీ మునుగోడులో జరిగే నియోజకవర్గ ఆత్మగౌరవ సభ కు కేంద్ర హెూంశాఖ మాత్యులు అమిత్ షా హాజరవు తున్నారని చౌటుప్పల్ పురపాలక పరిధిలో భాజపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ధిక్కరించి, తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధిని కాంక్షించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో తన అభిమానులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: