ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందించడమే కేసిఆర్, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
ఖిలా వరంగల్ 37వ డివిజన్ దళితబంధు ద్వారా మంజూరైన యూనిట్లతో లబ్దిదారుడు నలిగంటి నవీన్ ఏర్పాటు చేసుకున్న పింకి ఈవేంట్స్ (డిజే మరియు లైటింగ్ , సౌండ్స్ )ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, కేసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు. ప్రతి దళిత కుంటుంబానికి అందించేవరకు పథకం కొనసాగుతుందని అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి దళిత కుటుంబం ఆర్థికం ఏదగాలని అన్నారు..
ఈ సందర్బంగా డా.బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి మరియు అమరవీరుల స్థూపానికి ఎమ్యేల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్దానిక కార్పోరేటర్ బోగి సువర్ణ-సురేష్ ,34వ డివిజన్ కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి, 38వ డివిజన్ కార్పోరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ , స్దానిక తెరాస నాయకులు ఎల్లయ్య, ఉల్పత్ ,రాజారాం,శ్రీను,ప్రతాప్ , రాజేష్ ,అరుణ్ ,అజయ్ , అకిల్ ,సుధాకర్ ,తదితరులు పాల్గోన్నారు.

Post A Comment: