ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈ వినాయక చవితి...ప్రజలకు విఘ్నాలు తొలగించి... విజయాలు చేకూర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగవేళ ప్రతీ ఇల్లు ఒక దేవాలయం కావాలి. సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలి. విఘ్నాలు, ప్రజల కష్టాలు తొలగి శాంతి సౌఖ్యాలు నెలకొనాలి. పూర్వ పద్ధతిలో విఘ్నేశ్వరుడిని కలుద్దాం పర్యా వరణానికి పాటు పడదాం. మట్టి గణపతి ని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఆటంకాలెన్ని ఎదురైనా, వాటిని అదిగమించి, సలక ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి కోరుకున్నారు.

Post A Comment: