చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
తాను రాజీనామా చేయడంతో మునుగోడులో కొత్తపింఛన్లు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారినియోజకవర్గాలను వదిలేసి ఇక్కడ తిరుగుతున్నారని పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాచౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన సర్దారు సర్వాయిపాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాపన్న గౌడ్, ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్వర్ రెడ్డితన స్థాయినిదిగదార్చుకుంటూ వార్డుమెంబర్ల ఇండ్లకు వెళుతూ బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ
ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య రమేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, గణేష్ గౌడ్, సంపత్, శివ మహేష్ అజయ్ రామ్ గోపాల్ వంశి గౌడ్ పాల్గొన్నారు..
Post A Comment: