మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా జరిగిన పాదయాత్రకు ప్రజాస్పందన అద్భుతం. ఈ నెల 9 నుంచి ఏడు రోజుల పాటు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ చేసిన పాద యాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకుల కు, ఎన్టీపీసీ మిత్రులు సమన్వయంతో వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు... కాంగ్రెస్ పట్ల అభిమానం చాటారు. ఈ ఆనంద సమయంలో... రామగుండం ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తానని మాట ఇస్తున్నాను . ఇదే అంకితభావంతో పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను . అని మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు
ముఖ్యంగా రామగుండంలో ఈ సారి కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇందుకు కారణం... టీఆర్ఎస్ హామీలు ఆచరణకు నోచుకోకపోవడమే. టీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ సర్కారు పట్ల ప్రజల్లోనూ పెద్దఎత్తున ఆగ్రహం నెలకొంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, కౌలు రైతులకు సాయం, రైతుల రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణకు రాయితీ, మహిళా సంఖాలకు రుణాల మంజూరు, కొత్తగా పింఛన్లు.. ఇలా ఏ హామీ కూడా పట్టాలెక్కలేదు. ఈ సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఇక.. ఆ సమస్యలకు అదనంగా... రామగుండంలో అధికార పార్టీ లీడర్లు మాఫియాను తలపిస్తున్నారు. ఇసుక, బొగ్గు, బూడిద అక్రమ రవాణాతో కోట్లు దండుకుంటున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని దోచుకున్నారు. ఇలాంటి అనేక అంశాల పట్ల... ప్రజల మద్దతుతో నిరంతర పోరాటాలు చేస్తున్నాను. నిస్వార్థంగా పని చేసే కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరుల అండనే... నాకు కొండంత బలం. నిరంతర పోరాటాల క్రమంలోనే ప్రజా సంక్షేమంపై గళమెత్తుతున్న కాంగ్రెస్‌కు, మీ మనసుల్లో స్థానం సంపాదించుకున్న నాకు... చిన్నాపెద్ద అందరూ అండగా నిలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌తో కలసి నడచి, యాత్రకు ఘన విజయం కట్టబెట్టి, కొండంత ధైర్యాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఆత్మీయ ప్రజానీకం మద్దతుతో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదాం... రామగుండంలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం. నా పాదయాత్రకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు నా వెన్నంటి ఉండి యాత్రను విజయవంతం చేసిన ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని అలాగే రాబోయే రోజుల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలనిఎమ్మెస్ రాజ్ ఠాకూర్ అన్నారు
Post A Comment: