ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,విశిష్ట అతిథులుగా జెడ్పీ చైర్మన్ డా.సుధీర్ కుమార్,కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్ హాజరయ్యారు.వచ్చిన అతిధులు మరియు గౌడ సంఘం నేతలు పాపన్న గౌడ్ చిత్రపటానికి పుాలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన నాయకుడని, అతని చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పాపన్నగౌడ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని, గొప్ప వ్యక్తుల జయంతోత్సవాలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా చాలామంది ప్రజలకు తెలుస్తుందని,భవిష్యత్ తరాలకు పాపన్నగౌడ్ గొప్పతనం,తాను చేసినటువంటి పనులు తెలియజెప్పడానికే ఇలాంటి వేడుకలు జరుపుకుంటామని అన్నారు.కొంతమందికి కొన్ని నైపుణ్యాలుంటాయని, సామాన్య కుటుంబంలో పుట్టి ఒక రాజుగా పరిణతి చెందారని,ఆ కాలంలో చాలా యుద్ధాలను గెలిచి, పరిపాలనా పరంగా ఎటువంటి శిస్తులు వసూలు చేయకుండ రాజ్యపరిపాలన చేసిన మహా వ్యక్తి అన్నారు. అన్ని కులాల వారిని ప్రేమగా చూసేవాడని,వారియొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు .గౌడ కులస్తులు పాపన్నగౌడ్ విగ్రహం పెట్టడానికి స్థలం కావాలని అడిగారని, వారి కోరిక మేరకు ప్రభుత్వం తరపున విగ్రహం పెట్టడానికి స్థలం కేటాయిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.విశిష్ట అతిథి జిల్లా పరిషత్ చైర్మన్ డా.సుధీర్ కుమార్ మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ వరంగల్ జిల్లాలో పుట్టి ,అనతి కాలంలో గొప్ప వ్యక్తిగా ఎదిగాడని,తురుష్కుల అగడాలపై తిరుగుబాటు చేసాడని,రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరమని,వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. బీసీలకు వృత్తిరీత్యా వారి అవసరాలను గుర్తించి,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలని ఈ సందర్బంగా తెలిపారు.మరొక విశిష్ట అతిథి కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత జయంతోత్సవాలు జరపడం చాలా సంతోషకరమని అన్నారు.పాఠశాల విద్యలో పుస్తకాలలో పాఠ్య రుాపంలో పాపన్నగౌడ్ చరిత్రను రాసి, రాబోయే తరాలకు తెలపడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.మంచి కొరకై రాజ్యాన్ని ఏర్పరచిన నాయకుడి చరిత్ర అందరూ తెలుసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వాసు చంద్ర ,డీఆర్డివో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్,ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖర్, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఉపసంచాలకులు రాంరెడ్డి, గౌడ సంఘం నాయకులు జనగామ శ్రీనివాస్ గౌడ్ ,పులి సారంగపాణి, వడ్లకొండ వేణుగోపాల్ ,పులి శ్రీనివాస్ గౌడ్,చంద్రశేఖర్ ,చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: