Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, ఆగస్టు 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామానికి చెందిన మారపాక ఏలారి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై వైద్య చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చికిత్సకు అనుకూలంగా లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ చిదినేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జూకంటి రమేష్ ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని సానుకూలంగా పరిశీలించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా రూ.2 లక్షల 20 వేల విలువైన ఎల్‌వోసీ (Letter of Credit) మంజూరు చేయించారు. ఈ ఆర్థిక సహాయంతో చికిత్స కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఎల్‌వోసీ పత్రాలను అందుకున్న మారపాక ఏలారి, వారి కుటుంబ సభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను వెంటనే గుర్తించి, వైద్య సహాయం అందించడంలో ప్రత్యేక చొరవ చూపిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జూకంటి రమేష్‌కు కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నారని వారు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామ పంచాయతీలో బుధవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో దుర్గం శ్రీకృష్ణ, అంబాల పోసు, మంతెన రాజశ్రీ, రంగు ఊర్మిళ, ఆకుల సత్యక్క, నగునూరి రాజేశ్వరి, బౌతు పార్వతి, దాగం స్రవంతి, మొల్లు మాధవి తదితర లబ్ధిదారులు మంజూరు పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ మాట్లాడుతూ, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతలో అవకాశం రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తుందని సర్పంచ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఉప సర్పంచ్ రాజయ్య, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లింగయ్య, బి. రమేష్, గణేష్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day




కాటారం, ఆగస్టు 5: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కాటారం మండలంలోని చీడెనేపల్లి, రెగులగూడెం రెవెన్యూ గ్రామాల్లో బుధవారం అవగాహన గ్రామసభలు నిర్వహించారు. చీడెనేపల్లి గ్రామపంచాయతీలో చీడెనేపల్లి రెవెన్యూ గ్రామానికి, రెగులగూడెం గ్రామపంచాయతీలో రెగులగూడెం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన గ్రామసభల్లో భూ రీ-సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహణ, భూ రికార్డుల ఖచ్చితత్వం, రైతులు సమర్పించాల్సిన పత్రాలు, భూ వివాదాల పరిష్కారంలో రీ-సర్వే ప్రాధాన్యతపై అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాటారం తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భూములకు శాశ్వత హద్దులు ఖరారు చేయడంతో పాటు భూ రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిచేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రతి రైతు సర్వే సమయంలో తప్పనిసరిగా హాజరై అవసరమైన పత్రాలతో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ డిప్యూటీ ఐఓఎస్, సంబంధిత సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), గ్రామ పంచాయతీ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, చీడెనేపల్లి, రెగులగూడెం గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామసభలో రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చి, రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహాముత్తారం మండల కేంద్రం, కొర్లకుంట, మాదారం గ్రామాల్లో మొబైల్ లీగల్ అవేర్‌నెస్ వ్యాన్ ద్వారా న్యాయ అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారు, కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, కుటుంబ, సివిల్, ప్రామిసరీ నోట్ తదితర వివాదాల్లో చిక్కుకున్న బాధితులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. అక్షయ, ప్యానెల్ లాయర్ పారానంది సురేందర్, సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని, న్యాయపరమైన సమస్యలను సామరస్యంతో అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జి. నవీన్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, కే. వెంకటేష్, ఎం. రాజ్‌కుమార్, పారా లీగల్ వాలంటీర్ లింగమళ్ల రమాదేవి, పి. అంజయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పేద్దపల్లి :ఏడుగురు అరెస్ట్..రూ.35,200 నగదు,ఏడు మొబైల్ ఫోన్లు,52 పేకముక్కలు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధి నాగేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.35,200 నగదు,52 పేకముక్కలు,ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం..నాగేపల్లి గ్రామంలోని ఓ నివాస గృహంలో నగదును పందెంగా పెట్టుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో రామగిరి పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.దాడి సమయంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద ఉన్న నగదు,పేకముక్కలు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,పేకాట,జూదం,మాదకద్రవ్యాల విక్రయం,అక్రమ మద్యం తయారీ,గుట్కా అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలకు చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని,ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 3: మహాముత్తారం మండలం కోనంపేట మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP)లో కాంట్రాక్టర్ల అక్రమాలు, కార్మికుల శ్రమదోపిడీ, అలవెన్సుల కుంభకోణంపై కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) జిల్లా చైర్మన్ పీక కిరణ్ నాయకత్వంలోని ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జూలై 27న ఇదే అంశంపై వినతిపత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆగస్టు 3న రిమైండర్ లేఖను అందజేశారు. ప్లాంట్‌లో నిబంధనల ప్రకారం 60 నుంచి 80 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 16 మందితోనే నిర్వహణ కొనసాగుతోందని ఆరోపించారు. దీంతో కార్మికులపై అధిక పనిభారం పడటమే కాకుండా ఆదివారాలు, పండుగ సెలవులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కార్మికుల జీతాల నుంచి PF, ESI, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు అక్రమ కోతలు విధిస్తున్నారని, లేని ఉద్యోగులను రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. సూపర్‌వైజర్ పోస్టుల పేరుతో లక్షల రూపాయల అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని కూడా తెలిపారు. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, కార్మికులకు బకాయి అలవెన్సులు, PF, ESI, ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పందిస్తూ, మిషన్ భగీరథ మరియు కార్మిక శాఖ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాళేశ్వరం, ఆగస్టు 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానం చేసేందుకు గోదావరిలోకి దిగిన భక్తుడు బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి (50) ప్రమాదవశాత్తు బలమైన ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయి మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, శ్రీనివాస్ రెడ్డి పుణ్యస్నానం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో అదుపుతప్పి లోతైన నీటిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన అక్కడే ఉన్న నిట్టూరి మహేశ్, దరిపెల్లి శ్రీకాంత్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గోదావరిలోకి దిగి ఆయనను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ప్రవాహం వేగంగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం అందుకున్న స్థానికులు, ఇతర భక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అనంతరం కొంతసేపటి తర్వాత శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని గోదావరి నుంచి వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో త్రివేణి సంగమం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పుణ్యస్నానానికి వచ్చిన భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంశెట్టి రాజు పటేల్ అనే యువకుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం ప్రకారం, రాంశెట్టి రాజు పటేల్ స్నానానికి వెళ్లే సమయంలో బాత్రూం సమీపంలో ఉన్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు చేతికి తగలడంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దామెరకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.