December 2025
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.గోదావరిఖని.డిసెంబర్.22(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)రామగిరి మండలం.ముస్త్యాల గ్రామ నూతన పంచాయితీ పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.పంచాయితీ సెక్రెటరీ అషీయా నిశాత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన స్పెషల్ ఆఫీసర్ అరవింద్ సర్పంచ్.ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.సర్పంచ్ సుంకరి మహేష్.ఉపసర్పంచ్ బాసినేని వినోదరావు.వార్డు సభ్యులు నీలం శ్రీనివాస్.గోశిక విజయ్ కుమార్.సుందిళ్ల శారద.డేగ సందీప్ కుమార్.గోశిక రాజనర్సు.సుందిళ్ల కనకతారా.గుమ్మడి మల్లయ్య లతో ప్రమాణ స్వీకారం చేయించారు.పంచాయతీ సెక్రెటరీ వారిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పాలకవర్గం కొలువుదీరింది ప్రజా సమస్యలను తీర్చగలమని గ్రామ ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు.ఈసందర్భంగా కొందరు ప్రోటోకాల్ ను ధిక్కరించి!..వాళ్లే ప్రజాప్రతినిధులుగా!.అధికారుల!..అన్నట్టు వ్యవహరించారు?.ఎవరిని ఎవరు ఎందుకు సత్కరిస్తాన్నారో అర్థంగాని పరిస్థితి గందరగోళం.!.చూసేవారు ఇదేమి పద్ధతి అంటూ అసహనంవ్యక్తం...చేస్తూ ఆశ్చర్యపోయారు!.టూటౌన్ పోలీస్ వారు బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు.పంచాయతీ సెక్రెటరీ అషీయ నిషాత్,కారోబార్ ఎలుకటూరు శంకర్.సిహెచ్ఓ క్వాలిటీ మేనేజర్ రూప.హెడ్మాస్టర్ రాజేందర్.ఏఎన్ఎం.ఆశా వర్కర్.అంగన్వాడి టీచర్.విద్యుత్ శాఖ వారు..బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పుట్ట రాజన్న.వికలాంగుల రాష్ట్ర నాయకులు కన్నం స్వామి.గ్రామపంచాయతీ సిబ్బంది.పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు.పార్టీ నాయకులు కార్యకర్తలు.సాదుల సందీప్.శేఖర్.బొడ్డుపెళ్లి రవీందర్.రౌతు రమేష్-రేణుక. మచ్చ రవీందర్. భాసినేని రవీందర్రావు..సోలార్ కంపెనీ అధికారులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు...



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


 డిసెంబర్ 22 : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. దుర్గం నగేష్ నేటి జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్ అన్నారు. అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి ‘డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్’ గౌరవ డాక్టరేట్‌ను ఇటీవల అందుకున్న సందర్భంగా, ఆదివారం ఎన్టిపిసిలోని ఆయన నివాసంలో తెలంగాణ ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. దుర్గం నగేష్‌కు, ఆయన సతీమణి దుర్గం ప్రమీలకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బందెల రాజశేఖర్ మాట్లాడుతూ, దుర్గం నగేష్ ఒక దినపత్రికలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తూనే ప్రజా సమస్యలపై వార్త కథనాలు రాస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక చైతన్యానికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు బందెల శ్రీనివాస్, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీల నగేష్, సమతా సైనిక దళ్, సమతా ఫౌండేషన్ సభ్యులు చందనగిరి శివప్రసాద్, గూడూరి లవన్ కుమార్, దుర్గం వెంకట నరసయ్య, బెక్కం సాయి నిఖిల్, హరక్షిత తదితరులు పాల్గొన్నారు.