ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

చరిత్రను, మన సంస్కృతి తెలిపే గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉన్న ప్రదేశం మన ఓరుగల్లు అని రాథోడ్ రమేష్ అన్నారు. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని శనివారం నాడు హరిత కాకతీయలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి సూచికగా ఎదుగుతున్నది అని అన్నారు. రామప్ప, లక్నవరం, మేడారం, వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, మేడారం లాంటి చాలా పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని అన్నారు. అనంతరం జిల్లా పర్యాటక శాఖ అధికారి యం శివాజి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక పర్యాటక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. టూరిజం పోటెన్షియల్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. పర్యాటక రంగం పై అవగాహన కల్పించడంలో భాగంగా హనుమకొండ జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన , చిత్రలేఖనం పోటీలు నిర్వహించి నట్లు తెలిపారు. పర్యాటక ఆకర్షణలు పెంచడానికి, దేశ విదేశీ పర్యాటకులను వరంగల్ రప్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేసవిలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న సుందరీమణులు నగరానికి తీసుకు రావడం వల్ల మన కీర్తి విశ్వవ్యాప్తం అయింది అని అన్నారు.అనంతరం 60 మంది విజేతలు అయిన విద్యార్థులకు రాథోడ్ రమేష్, శివాజీ సంయుక్తంగా ప్రశంసా పత్రాలను అందించారు. ఆకట్టుకున్న సంస్కృతిక కార్యక్రమాలు. పర్యాటక ఉత్సవాల్లో భాగంగా తాడూరి రేణుక శిష్య బృందం నిర్వహించిన నృత్యాలు అలరించాయి. పర్యాటక ప్రాంతాలను తెలిపే గీతం తో పాటుగా బతుకమ్మ ప్రత్యేక గీతానికి కళాబృందం చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు హరిత కాకతీయ మేనేజర్ శ్రీధర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్, కుమారస్వామి, ధనరాజ్, కుసుమ సూర్య కిరణ్, కే . లోకేశ్వర్, డీ. చిరంజీవి, శరత్, సతీష్ , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్యాకేజీ టూర్...


ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సహకారంతో వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ ను నిర్వహించారు. విద్యార్థుల కోసం వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్ ప్రాంతాలను చూపించి, గైడ్ సహకారంతో ఆయా ప్రాంత చరిత్రను వివరించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: