ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లాలో పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నిర్మించుకున్న నూతన గృహంలోనికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథి గా హాజరు కాగా గురువారం గృహప్రవేశం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భీమదేవరపల్లి లో మార్పాటి సుధా అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటి ప్రారంభోత్సవం చేశారు. తమ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు సుధా అశోక్ రెడ్డి దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసిన లబ్ధిదారు మార్పాటి సుధా దంపతులకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్, పంచాయతీ కార్యదర్శి రాజు, స్థానికులు,తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: