ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ 

జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏ.రేవంత్ రెడ్డి

 అధికారులను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి  అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేశారు.   దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.


టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు.

భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని  పరిశీలిస్తామన్నారు,

జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ , డీఎఫ్ఓ లావణ్య, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, పరకాల ఆర్డిఓ కే.నారాయణ ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్, నేషనల్ హైవే అథారిటీ, సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: