ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
తెలంగాణ సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి అదనపు ఎస్పీ ఏ.నరేష్ కుమార్ ,పూలమాల వేసి నివాళులుర్పించారు .
ఈ సందర్భంగా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ ని స్మరించుకోవడం జరిగింది. “చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించారు. సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం పోరాడిన ఆమె నిజమైన వీరవనిత. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్పూర్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన త్యాగాలు ఈ తరం వారికి ఆదర్శం” అని వారి ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఓ ఫర్హాన, ఆర్.ఐ లు రత్నం, శ్రీకాంత్, ఆర్ఎస్ఐ లు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: