ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ 

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామపంచాయతీ పాలన ఆఫీసర్లు( జిపివోలు) క్లస్టర్లకు కేటాయింపు ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పారదర్శకంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 123 క్లస్టర్లకు జిపిఓల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ తో అధికారులు చేపట్టారు. జిపివో  పరీక్ష 128 మంది రాసి ఉత్తీర్ణులు కాగా వారికి క్లస్టర్ కేటాయింపు ప్రక్రియను కలెక్టరేట్ లో నిర్వహించారు. 123 క్లస్టర్లకు గాను 125 మంది జిపివో లను  కౌన్సిలింగ్ ద్వారా  కేటాయించారు. 


ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి  వై వి గణేష్ ఆధ్వర్యంలో సాగింది. 128 మందిలో ముగ్గురు విముఖత చూపించగా 125 మంది జిపివోలు కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. 123 క్లస్టర్లకు కౌన్సిలింగ్ ద్వారా  కేటాయించబడిన జిపివోలు కౌన్సిలింగ్ నిర్వహణ, కేటాయింపు చేయడం పట్ల  ఆనందం వ్యక్తం చేశారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో డిఆర్ఓ వైవి గణేష్ తో పాటు కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్, కార్యాలయ సూపరింటెండెంట్ లు నాగరాజు, ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: