ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు తన ప్రియురాలిని కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
సౌరిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్లా గ్రామానికి చెందిన 22 ఏళ్ల దేవాన్షు, సుల్తాన్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల దీప్తి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం దీప్తి కుటుంబ సభ్యులకు తెలియడంతో, ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దేవాన్షు, తన ప్రియురాలు ఇంకెవరికీ దక్కకూడదని భావించాడు. సోమవారం రోజున దీప్తిని తుపాకీతో కాల్చి చంపిన దేవాన్షు, ఆ తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Post A Comment: