హృతిక్ సాయి NIT హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం, చదువులో వెనుకబడుతున్నానని, మార్కులు సరిగా రావడం లేదని గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వరంగల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టి హృతిక్ సాయి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హృతిక్ సాయి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఈ సంఘటన NIT క్యాంపస్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. హృతిక్ సాయి ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: