హుజరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బాణాల బక్కిరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు, బైక్ రెండింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించడం, వాహనాలను నెమ్మదిగా నడపడం చాలా అవసరం.

Post A Comment: