ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ప్రతిరోజు ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని సూచించారు. మెనూ ను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయులు అధ్యాపకులతో మాట్లాడారు.
Post A Comment: