ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ జిల్లా భీమారం పలివేల్పుల రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైనింగ్ హాల్, వాష్ ఏరియాను పరిశీలించారు. స్టోర్ రూమ్ లో భద్రపరిచిన కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు. డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్న విద్యార్థినులతో పాటు తరగతి గదుల్లో ఉన్న విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సుభాషిణి ని కలెక్టర్ ఆదేశించారు. డైనింగ్ హాల్, వాష్ ఏరియా, కారిడార్ పరిసరాలు, కొన్ని ఆహార పదార్థాలు బాగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పరిశుభ్రత చర్యలు చేపట్టాలని హాస్టల్ ప్రిన్సిపల్ ను ఆదేశించారు. టాయిలెట్స్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.


Post A Comment: