మంగళ్‌హాట్, డబీర్‌పురా ప్రాంతాల్లో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ సేఫ్టీ అధికారులు) ఆకస్మిక దాడులు నిర్వహించారు. డబీర్‌పురాలోని మాతాకీ కిడ్కి ప్రాంతంలో దాదాపు 2 క్వింటాళ్ల పాడైన మేక, గొర్రె మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ లకు,వివాహాలు జరిగే ప్రదేశాలకు ఈ మాంసాన్ని సప్లై చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు. మంగళ్ హాట్ లో దాదాపు 12 టన్నుల మేక మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. కుళ్లిన మాంసం తరలిస్తున్న వ్యాపారి మిస్సాహుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుళ్లిన మాంసాన్ని టోలిచౌకి, అత్తాపూర్, మెహిదీపట్నం ప్రాంతాల్లోని ప్రముఖ హోటళ్లకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లోని హలీమ్, మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రజలు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యత లేని ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కుళ్లిన మాంసం సరఫరాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనపై అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. హోటల్స్ మరియు రెస్టారెంట్స్ లో నాణ్యతలేని ఆహారం వాడకం వలన హైదరాబాద్ నగర ప్రతిష్ట మసకబారుతుంది అని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరము ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో అట్టడుగు స్థానం లో ఉంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆహార భద్రతపై ఆందోళనలను పెంచింది. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Post A Comment: