ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ గుండ్ల సింగారంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తో పాటు ఇది ఆవరణలోని అంగన్వాడి పూర్వ ప్రాథమిక పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు.
పాఠశాలలోని తరగతి గదులు, ఆవరణ పరిసరాలు, అంగన్వాడీ కేంద్రంలోని గదులను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం గురించి ఎలా ఉంటుందని వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు, నిర్వాహకులకు తెలియజేశారు.
నయీమ్ నగర్ వంతెన, నాలా విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఈఈ రాజయ్య, ఇతర అధికారులు కలెక్టర్ కు వివరించారు.
నాలా పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ,మేయర్ ..
నయీంనగర్ నాలా వంతెన పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ కు,ఎమ్మెల్యే కు అభివృద్ధి పనులు ఈఈ రాజయ్య వివరించారు.
Post A Comment: