ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
హనుమకొండ అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పూలను సమర్పించి అంజలి ఘటించారు.
అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ,అటవీ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
జాతీయ గీతాలాపన అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అదేవిధంగా రాష్ట్ర గీతమైన జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Post A Comment: