ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎంతో మంది త్యాగాలతోనే హైదారాబాద్ నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనమైందని, 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం సిద్ధించిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లాఎస్పీ కిరణ్ ఖరే అన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు, పోలీసు అధికారులకు సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ గారు, తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి చిత్ర పటాలకు పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న భారత దేశ యూనియన్ నందు విలీనమైన సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేటితో 77 సంవత్సరములు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించు కోవడం జరుగుతున్నదన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం సాధించడానికి కృషి చేసిన మహనీయుల సేవలు చిరస్మణీయమని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ( ఆపరేషన్) బోనాల కిషన్, భూపాలపల్లి డిఎస్పి ఏ. సంపత్ రావు, డిపిఓ ఏవో వసీం ఫర్హాన జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు, పోలీసు, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: