ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హనుమకొండలో ఈ నెల 9వ తేదీన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం నాటికి అన్ని పనులను పూర్తి చేసి సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి అన్నారు.
సోమవారం హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను నగరం మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కాళోజీ కళా క్షేత్రంలోని వివిధ విభాగాలను సందర్శించి వాటి గురించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి మాట్లాడుతూ కళాక్షేత్రంలోని ఏవైనా అదనపు పనులు ఉంటే నాలుగు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. సెప్టెంబర్ 9 వ తేదీ నాటికి ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.
వీరి వెంట పిఓ అజిత్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
Post A Comment: