ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కుడా అధికారులను ఆదేశించారు.
గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతోపాటు సుందరీకరణ చేపట్టడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ పరిశీలించారు.
ప్రతిపాదిత జంక్షన్ స్థలంతో పాటు బస్టాండ్ ప్రాంతాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేసే అందించాలని కుడా అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, కుడా పివో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: