ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్  పి. ప్రావీణ్య  ఆదేశించారు.

శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై  టెలీ కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వర్ష ప్రభావ పరిస్థితులను  ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పటిష్ట చర్యలు  చేపట్టాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలలో  వర్ష ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు నియమించాలన్నారు. కల్వర్టులు, లో లెవెల్ కాజ్ వేలు ఉన్నచోట్ల సిబ్బంది ఒకరిని నియమించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటిల్లో నివసిస్తున్న  వారిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేరే చోటికి తరలించాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్  చేసి ప్రజలకు అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో  కలెక్టరేట్ లో 24 గంటల పాటు పనిచేసేవిధంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వర్ష ప్రభావ పరిస్థితి గురించి కంట్రోల్ రూమ్ కు  తెలియజేయాలన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ ను వరంగల్ మహానగర పాలక సంస్థ కంట్రోల్ రూమ్ తో  అనుసంధానం చేయాలన్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో  సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, సాగునీటి పారుదల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు  అప్రపత్తంగా  ఉండాలన్నారు. చెరువులు, కుంటల పరిస్థితిని సాగునీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వర్ష ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. 

ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులతో పాటు, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: