BREAKING NEWS
ఆస్తి తగాదాలతో కుమారుడిని తండ్రి హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలు.. కోరుట్ల మండలం మోహనరావుపేటకు చెందిన తండ్రి గంగరాజన్, కుమారుడు రాజేశ్ (32) మధ్య ఆదివారం రాత్రి ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగి గంగరాజన్ రాజేశ్ను కత్తితో దాడి చేశాడు. వెంటనే రాజేశ్ను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గంగరాజన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Post A Comment: